కొన్ని రోజులుగా ఉత్కంఠను రేకెత్తించిన మహారాష్ట్ర రాజకీయాలు మంగళవారంతో సద్దుకున్నాయి.ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారోనన్న అనుమానాలు నిన్నటితో తేటతెల్లం అయ్యాయి.ఈ నెల 23 న ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన ఫడ్నవీస్ మూడు రోజుల ముఖ్యమంత్రిగానే చరిత్రలో నిలిచాడు.ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో సాగిన మరాఠా రాజకీయాలు ప్రతి ఒక్కరికి ఉత్కంఠ కలిగించాయి. ఎన్సీపి నేత అజిత్ పవార్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బిజేపి సర్కార్,సడన్ గా అజిత్ పవార్ తప్పుకోవడంతో,తప్పని సరి పరిస్థితుల్లో సరైన సంఖ్యా బలం లేక బిజేపీ కూడా అధికారం నుండి తప్పుకోవాల్సి వచ్చింది.దీంతో మహారాష్ట్రలో శివసేన,ఎన్సీపి,కాంగ్రెస్ పార్టీలు కలసిమహా వికాస్ అఘాడి కూటమి పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి.కూటమి సీఎం అభ్యర్థిగా శివసేన నేత ఉద్దవ్ ఠాక్రే ను ఎన్సీపి పార్టీ ప్రకటించింది.
మహారాష్ట్ర అసెంబ్లీ లో బుధవారం ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కోలాంబర్ ఆద్వర్యంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మేల్యేలు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మెజార్టీ సభ్యులు ఉన్నారని గవర్నర్ కి కూటమి నాయకులు 162 ఎమ్మేల్యేల సంతకాలతో కూడిన లెటర్ సమర్పించడంతో, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ ఉద్ధవ్ ఠాక్రేకు ఆహ్వానించారు .ఈ నెల 28న గురువారం సాయంత్రం 6:40 గంటలకు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి గా శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముంబైలోని ఐకానిక్ శివాజీ పార్క్‌లో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం జరుగుతుందని శివసేన నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు అందరు హాజరవుతారని తెలుస్తోంది.శాసన సభలో మెజార్టీ నిరూపించుకోవటానికి డిసెంబర్ 3 వరకు గవర్నర్ ఉద్దవ్ ఠాక్రే కు సమయం ఇచ్చారు.