Home / ANDHRAPRADESH / కడపలో తెలుగు తమ్ముళ్ల రివర్స్ క్లాస్.. అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు..!

కడపలో తెలుగు తమ్ముళ్ల రివర్స్ క్లాస్.. అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు..!

బొమ్మరిల్లు సినిమా గుర్తుంది కదా..అందులో తండ్రి అతి క్రమశిక్షణ వల్ల హీరో సిద్ధార్త్ బాగా ఇబ్బంది పడతాడు..చివరకు క్లైమాక్స్‌లో అంతా మీరే చేశారంటూ..తండ్రి ప్రకాష్ రాజ్‌కు రివర్స్ క్లాస్ తీసుకుంటాడు.. తాజాగా రాజకీయాల్లో అంతా నేనే..అంతా నావల్లే, నేను నిప్పు అని చెప్పుకునే బొమ్మరిల్లు బాబుగారికి తెలుగు తమ్ముళ్లు ఏకంగా క్లాస్ తీసుకున్న వైనం ఆసక్తి రేపుతోంది. వివరాల్లోకి వెళితే ఏపీలో రోజు రోజుకీ పతనమవుతున్న పార్టీని  బతికించుకునేందుకు. . చంద్రబాబు సమీక్షా సమావేశాల పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే..ఎక్కడకు పోయినా..ప్రజలు నన్నే కోరుకుంటున్నారు తమ్ముళ్లు అంటూ బాబుగారు తనకు తాను స్వకుచమర్దనం చేసుకుంటూనే ఉన్నారు. అయితే ఈ సమీక్షా సమావేశాల్లో పార్టీ బలోపేతానికి సూచనలు చేసేది పోయి..ఎంత సేపూ తనకు తాను గొప్పలు చెప్పుకుంటూ కార్యకర్తలకు క్లాస్‌ తీసుకుంటున్నాడు.. అయితే కడపలో మాత్రం తెలుగు తమ్ముళ్లు చంద్రబాబుకే రివర్స్ క్లాస్ తీసుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే తాజాగా పార్టీ సమీక్షా సమావేశాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు కడపలో పర్యటించాడు. ఈ సమావేశానికి కడప జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు..మామూలుగా చంద్రబాబు తనకు తాను గొప్పలు చెప్పుకోవడం అలవాటు.. అంతే కాదు విజయాలు వస్తే అంతా నేనే చేశా..అదే ఓటమి ఎదురైతే నేను అంతా బాగానే చేశారు..ఎవరూ సరిగా పని చేయలేదు..ఈ ఓటమికి మీరే కారకులు అంటూ కార్యకర్తలపై, నాయకులపై నెపం వేయడం చంద్రబాబుకు అలవాటు. పనిలో పనిలో కడపలో కూడా అదే తరహాలో క్యాడర్‌కు బాబు క్లాస్‌ తీసుకోబోయాడు..అయితే కడప కార్యకర్తల ముందు బాబుగారి పప్పులు ఉడకలేదు..పైగా కార్యకర్తలే మైక్ తీసుకుని అంతా మీరు చేశారు..పార్టీ చిత్తుగా ఓడిపోవడానికి మీరే కారణమంటూ..బాబు గారికి రివర్స్ క్లాస్ తీసుకున్నారంట…ఇంతకీ కార్యకర్తలు ఏమన్నారంటే,,,బొమ్మరిల్లు సిన్మాలో సిద్ధార్ట్ తరహాలో అంతా మీరు చేశారు..పార్టీ చిత్తుగా ఓడిపోవడానికి మీరే కారణమంటూ కుండ బద్ధలు కొట్టారంట.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవసరం లేకపోయినా 23 మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారు..( సంతలో పశువులను కొన్నట్లు అనేది చంద్రబాబు డైలాగే..అదే డైలాగ్‌ను ఆయనకే రివర్స్‌లో వేశారంట)…అందుకే 23 మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయ్యామని, సీఎం రమేష్ లాంటి వ్యాపారస్థుడు, నమ్మకద్రోహికి సర్వం అప్పచెప్పారు..వైసీపీ నుంచి వచ్చిన ఆదినారాయణరెడ్డిని దోచుకోమని చెప్పారు..అలాంటి వారికే ఐదేళ్లు వంతపాడారు..అందువల్లే పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోయిందని తెలుగు తమ్ముళ్లు బాబుగారికి రివర్స్‌లో క్లాస్ పీకారంట..దీంతో ఓ దశలో కార్యకర్తలపై ఇక చాలు ఆపండి..నాకన్నీ తెలుసంటూ.. చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారంట..పాపం బాబుగారికి తనను తాను పొగుడుకోవడం, ఎదుటోళ్లను తిట్టడం తప్పా..సొంత పార్టీ కార్యకర్తలతో ఇలా ఎన్నడూ తిట్టించుకున్న పాపాన పోలేదు..అందుకే కార్యకర్తలు తనకే రివర్స్ క్లాస్ తీసుకోవడంతో వారిపై చిరాకు పడ్డారంట..మొత్తంగా కడప పార్టీ సమావేశంలో బొమ్మరిల్లు క్లైమాక్స్ సీన్ రిపీట్ అయింది. ఈ ఘటన ఇప్పుడు టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat