అక్కినేని వారి కోడలు.. కొన్ని లక్షలాది మంది యువతకు ఆరాధ్య దైవం.. అందాల రాక్షసి సమంత మరో సరికొత్త పాత్రలో కన్పించనున్నారు. ఇందులో భాగంగా సమంత త్వరలోనే నిర్మాతగా తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నారని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అందులో భాగంగానే అతి కొద్ది రోజుల్లోనే నిర్మాణ రంగంలోకి సమంత అడుగుపెడుతుంది . త్వరలో దీనికి సంబంధించి అధికారక ప్రకటన వస్తుంది అని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతుంది.
అయితే దర్శకులు ఎవరైన మంచి కథ చెబితే వెంటనే నిర్మాతగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సమంత సిద్ధమని కూడా చెబుతున్నారు.