వివాదస్పద దర్శకుడు’ రామ్ గోపాల్ వర్మ తన కొత్త సినిమా ‘‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు. బుధవారం సినిమా విశేషాలను వెల్లడించడానికి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా వారు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ నవ్వించాడు వర్మ. కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా రాష్ట్రంలో బాగా పాపులర్ అయిన ఓ తండ్రీ కొడుకులకు అంకింతం అని దర్శకుడు ఆర్జీవీ చెప్పారు. తన కెరీర్ లో తొలిసారి తాను తీసిన మెసేజ్ ఓరింయెంటెడ్ సినిమా ఇది అని ఆర్జీవీ అన్నారు. తన సినిమాలకు కోర్టులకు వెళ్లడం కామన్ అయిపోయిందని ఆయన చమత్కరించారు. 2019 నుంచి 2020 మధ్యకాలంలో జరిగింది అనే కథను ఊహించి ఈ సినిమా చేసా అన్నారు. పప్పు సీన్ టీడీపీ వాళ్లకే బాగా నచ్చిందని, చాలా మంది ఫోన్లు చేసి మరీ అభినందించారని చెప్పాడు.బహుశా వాళ్లు పీల్ అయి, చెప్పలేకపోయినది తాను చెప్పానని అలా చేసి వుంటారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తెరకెక్కించిన సినిమా కావడంతో సినీ, రాజకీయ వర్గాల్లో ఈ సినిమా పట్ల ఆసక్తి నెలకొంది. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ నవంబర్ 29న విడుదల కానుంది..