మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని శామీర్‌పేట్ మండలం జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఇవాళ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. లెప్రసి కాలనీలో 3.0 ఎంఎల్ జీఎల్‌ఎస్‌ఆర్(గ్రౌండ్ లెవల్ సర్వీసు రిజర్వాయర్) మంచి నీటి రిజర్వాయర్‌ను మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా కాలనీలో సీసీ కెమరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ మంచినీటి వాటర్ ట్యాంక్ ద్వారా 196 కాలనీలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. మేడ్చల్ నియోజకవర్గం లోని అత్యంత జనాభా కలిగిన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషషన్‌కు అధిక నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. భద్రతాపరంగా ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ యం.వి.రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అరుణ కుమారి, ఎమ్మార్వో నాగమణి, స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
శామీర్ పేట్ మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని లెప్రసి కాలనీ లో 3.0 ML GLSR మంచి నీటి రేజర్వాయర్ ను ప్రారంభించడం జరిగింది.
తదనంతరం మంచి నీటిని విడుదల చేయడం జరిగింది.@trspartyonline @KTRTRS pic.twitter.com/LJ8EZjDAUP— Chamakura Malla Reddy (@chmallareddyMLA) November 27, 2019