ఎంపీ సంతోష్ కుమార్ మరోసారి గొప్ప మనస్సును చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం కోదురుపాక గ్రామానికి చెందిన కత్తెరపాక లక్ష్మీ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో భాదపడుతుంది. ఆమె ఆరోగ్యపరిస్ధితి తీవ్రస్ధాయికి చేరడంతో 20రోజుల క్రితం హైదరబాద్ లో రాజ్ భవన్ వద్ద ఉన్నా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్ధితిని స్ధానిక జెడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవిందర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే ఈసమస్య ను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. యశోద ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు ఎంపీ సంతోష్ కుమార్. వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.4లక్షల సహాయనిధి విడుదల చేయింంచారు. బాధితురాలి తీవ్రతను గ్రహించి వెంటనే స్పందించిన టీఆర్ఎస్ రాష్ట్రనాయకులు రవీందర్ రావు, ఎంపీ సంతోష్ కుమార్ కు లక్ష్మీ కుమారుడు కత్తెరపాక రాజమల్లు కృతజ్నతలు తెలిపారు.