రైతులు బాగుపడాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ మరియు దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బుధవారం దిలావర్పూర్ మండలంలోని కాల్వ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు, కోటి 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 కెవి సబ్ స్టేషన్ కు పూజ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు ను ఆర్థికంగా బలోపేతం చేయడమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనేక సంక్షేమ పథకాలు రైతుల కోసం అమలు చేస్తున్నారన్నారు. రైతు అధికంగా బలపడేలా ప్రభుత్వం రైతులకు అనేక ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. ఉచితంగా కరెంటు సరఫరా చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనన్నారు. రైతులకు రైతుబంధు, రైతు బీమా, నాణ్యమైన ఎరువులు సకాలంలో అందిస్తున్నమని తెలిపారు. పాత ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నియమించి రైతులకు సలహాలు సూచనలు అందించడం జరుగుతుందన్నారు. మార్చి 31లోగా వరి పంటలు కోసే విధంగా రైతులు సకాలంలో తూకం , వరి నార్లు వేసుకోవాలని సూచించారు.కాల్వ గ్రామంలో 2కోట్ల 50 లక్షల తో ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రామాల అభివృద్ధి కి నెల నెల బడ్జెట్ పవేశపెడుతున్నారు కాల్వ గ్రామ అభివృద్ధి కి నెల కు 3లక్షల నిధులను కేటాయించమన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవొతు రాజేందర్,FSCS చైర్మన్ రాం కిషన్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్,SE చౌహన్, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సుభాష్ రావు, ఎంపీపీ అమృత చిన్నారెడ్డి, వైస్ ఎంపీపీ బాబురావు, సర్పంచ్ తిరుమల శ్రీనివాస్, నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, నాయకులు మల్లికార్జున రెడ్డి, మారుగొండ రాము, ధర్మజి శ్రీను తదితరులు పాల్గొన్నారు.