ఆరోగ్యశ్రీ క్రింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్ధిక సహాయం అంధించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.రోగులకు విశ్రాంతి సమయంలో ఆర్ధిక సాయం అందించడం దేశం లొనే మొట్ట మొదటి సారి అమలు చేసే ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది.డిసెంబరు 1 నుంచి ఆరోగ్యశ్రీ క్రింద శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్ధిక సహాయం కింద రోజుకి రూ.225లు లేదా నెలకు రూ.5వేలు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆర్థికసాయాన్ని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో రోగుల అకౌంట్లలో నేరుగా జమ చేయుటకు నిర్ణయించారు.26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఈ ఆర్ధికసాయం అందనున్నది.ఏడాదికి దాదాపు రూ.268.13 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయడం జరిగింది. ఈ పథకం అమల్లో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా చూడాలన్న సీఎం జగన్ ఆదేశించారు.ఆరోగ్యమిత్రలకు పథకం అమలు కోసం అవసరమైన నియమ నిబంధనలు, అవగాహన కల్పించాలని ఆదేశించారు. దేశంలోనే తొలిసారి ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలోనే చేపడుతున్నామని దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసేలా మన పనితీరు ఉండాలన్న ముఖ్యమంత్రి జగన్ కోరారు.
