హాన్సిక ఒక పక్క కైపెక్కించే అందం.. నవ్వితే సొట్టలు పడే బుగ్గలు..చూడగానే కుర్రకారుకు మతి పోయే సోయగం.. ఒక పక్క ఇన్ని అందాలున్న మరోపక్క చక్కని అభినయంతో తెలుగు,తమిళ సినిమా ప్రేక్షకుల మదిని చురగొన్న అందాల బబ్లీ రాక్షసి. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఈ హాట్ బ్యూటీ తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది.
ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ ఒక ప్రముఖ పత్రికకు ఇంటర్వూ ఇచ్చింది. ఆ ఇంటర్వూలో తన గురించి పలు అంశాలపై క్లారిటీచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలో హాన్సిక తన బాల్యం గురించి మాట్లాడుతూ” చిన్నతనంలో చదువుకునే సమయంలో బాగా చదువుకుని న్యాయవాది అవ్వాలని కలలు కనేదాన్ని.
లాయర్ అయిన తర్వాత మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని ఆనందంగా జీవించాలన్నదే నా డ్రీమ్ “అని చెప్పుకొచ్చింది. అయితే అనుకోకుండా నేను సినిమాల్లోకి బాల్యనటిగా ఎంట్రీచ్చి.. ఇప్పుడు హీరోయిన్ గా సెటిల్ అయ్యాను అన్నారు..