మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఉన్న కాస్త పరువు తీసేసాడు. ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుని దారుణంగా ఓడించిన ఇంకా బుద్ధి రాలేదు. అధికార పార్టీని ఏదో విధంగా ఇరుకున పెట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ చెయ్యలేకపోయారు. మొన్నటివరకు ఇంగ్లీష్ మీడియం విషయంలో ఏవేవో మాట్లాడిన బాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నడు. దీనిపై ఘాటుగా రిప్లై ఇచ్చాడు విజయసాయి రెడ్డి.”ఇసుక తుఫానులో గిర్రున తిరిగి పడ్డాక ఇంగ్లీష్ మీడియంపై గుండెలు బాదుకున్నాడు. ప్రజలు ఛీత్కరించే సరికి అసలు ఇంగ్లీష్ మీడియం ఆలోచనే తనదని యూటర్న్ తీసుకున్నాడు. బతుకంతా అవకాశవాదం, మ్యానిప్యులేషన్లే. పాతాళంలోకి జారిపోయిన మిమ్మల్ని ధర్మాడి సత్యం కూడా బయటకు లాగలేరు” అని అన్నారు.