చంద్రముఖి సిన్మాలో జ్యోతికను చూపిస్తూ.. చూడు చంద్రముఖిలా మారిన గంగను అని.. రజనీకాంత్ ప్రభుతో అంటాడు..సేమ్ టు సేమ్ చూడు..చంద్రబాబులా మారిన పవన్ కల్యాణ్‌ను అని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన బొత్స జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై నిప్పులు చెరిగారు. రాను రాను పవన్, చంద్రబాబుకు కోరస్‌గా మారారని తీవ్ర విమర్శలు చేశారు. ఎంతసేపు బాబు పాటకు కోరస్ ఇవ్వడమే తప్పా..పవన్ చేస్తుంది ఏం లేదని మంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అవినీతిపై ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఓ టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. సీఎం జగన్ స్వయంగా ఈ కాల్‌సెంటర్‌కు కాల్ చేసి ఫిర్యాదులకు సంబంధించిన వ్యవస్థ పనితీరును తెలుసుకున్నారు. ఈ విషయంపై బొత్స మాట్లాడుతూ.. అవినీతిపై ఫిర్యాదుల కోసం తొలిసాలిగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటుచేశాం. ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికైనా ఈ ఆలోచన రాలేదని..కేవలం సీఎం జగన్‌కు వచ్చిందని చెప్పారు. అయితే పవన్‌కు మాత్రం ఇలాంటివి కనిపించవు…ఆయనకు ఎంతసేపు చంద్రబాబే కనిపిస్తారు. బాబు ఏం చెబితే పవన్ దానికి కోరస్. ఆఖరికి పవన్ పరిస్థితి కోరస్ కింద అయిపోయింది. మెయిన్ పోయి కోరస్ కి వచ్చిందంటూ బొత్స తనదైన శైలిలో వెటకారం ఆడారు. నవరత్నాలు, ఇసుక పాలసీ, ఇంగ్లిష్ మీడియం లాంటి కొత్త కార్యక్రమాలను అమలు చేసేటప్పుడు సమస్యలు తప్పవని, ఓ 10 రోజులు ఇబ్బందులుంటాయని బొత్స చెప్పుకొచ్చారు. ఈమాత్రం దానికే చంద్రబాబు గోతికాడ నక్కలాగ రెడీగా ఉంటారు. ప్రజలను రెచ్చగొడతారు. పొరపాటున మేం వెనక్కి తగ్గితే, ఆయనేదో మేలు చేసినట్టు తన ఖాతాలో వేసుకుంటాడు.. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడ్డం వేస్ట్ అంటూ చంద్రబాబుపై బొత్స మండిపడ్డారు. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలున్నాయి..చంద్రబాబుకు ఏం మాట్లాడే విషయాలు లేక.. ఇలా కొన్ని డ్రామాలు క్రియేట్ చేస్తున్నారని, వాటికి పవన్ కోరస్‌గా వంతపాడుతున్నారని బొత్స విమర్శించారు. మొత్తంగా పవన్ కల్యాణ్ చంద్రబాబుకు కోరస్‌గా మారిపోయాడని బొత్స చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
