ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. రాజకీయనాయకులు,ఆటగాళ్లు, గ్యాంగ్ స్టర్స్ , సినీ ప్రముఖులు, విద్యార్థి సంఘ నాయకులు ఇలా ఎవరు వుంటే వాళ్లపై బయోపిక్ లు చేస్తున్నారు. హీరో సందీప్ కిషన్ కూడా ఇదే బాట పట్టాడు. ఓ బయోపిక్ ను చేసేయాలని డిసైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఆయన ఓ ఎన్నారై నిర్మాతతో కలిసి ఈ ప్రాజెక్టును భాగస్వామ్యంపై నిర్మించాలని చూస్తున్నట్లు సమాచారం. దివంగత యువనటుడు ఉదయ్ కిరణ్ జీవితగాధ ఆధారంగా సందీప్ కిషన్ అండ్ టీమ్ ఈ బయోపిక్ ను చేయబోతున్నట్లు తెలుస్తోంది. షార్ట్ ఫిలింస్ చేసిన ఓ యంగ్ న్యూ డైరక్టర్ ఈ ప్రాజెక్టును టేకప్ చేయబోతున్నట్లు సమాచారం. ఏ బ్యాక్ సపోర్ట్ లేకుండా ఉదయ్ కిరణ్ సినిమాల్లోకి వచ్చి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. తక్కువ కాలంలోనే మంచి సినిమాలు చేసాడు. ఏకంగా పెద్దింటికి అల్లుడు కాబోయాడు. అంతలోనే విషాదాంతమైపోయింది అతని జీవితం. ఇవన్నీ కలిపి స్టోరీ చేసి, బయోపిక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.ఉదయ్ కిరణ్ పాత్రలో సందీప్ కిషన్ కనిపిస్తాడు. మిగిలిన నటీ నటుల వివరాలు తెలియాలిసిఉన్నదని వార్తలు వినిపిస్తున్నాయి.
