సొట్ట బుగ్గల సుందరీ తాప్సీ పన్ను అప్పట్లో వరుస సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన అందాల రాక్షసి. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకెళ్లి అక్కడ స్థిరపడింది ఈ ముద్దుగుమ్మ. అక్కడ అవకాశాలు తగ్గడంతో బ్యాక్ టూ హోమ్ అంటూ ఇక్కడ లేడీ లీడ్ రోల్ చేస్తుంది. ఈ క్రమంలో గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో పాల్గొన్నది.
ఈ నేపథ్యంలో విలేఖర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది ముద్దుగుమ్మ. ఈ క్రమంలో అమ్మడు అన్ని సమాధానాలను ఇంగ్లీష్ లో ఇస్తుంది ఈ సొట్ట బుగ్గల సుందరి. దీంతో ఒక విలేఖరు హిందీ మూవీల్లో నటిస్తూన్నారు కదా.. హిందీలో సమాధానాలు చెప్పొచ్చు కదా అని సూచించాడు.
ఒక్కసారిగా అవాక్కైన తాప్సీ” నాకు తెలుగు,కన్నడ భాషలు వచ్చు. వాటిలో సమాధానం ఇవ్వానా మరి. మనం మాట్లాడింది ఏ భాషా అనేది ముఖ్యం కాదు. ఎదుటివారికి మనం మాట్లాడింది చేరిందా..? ఆర్ధమైందా..? లేదా అనేది ముఖ్యమని సమాధానమివ్వడంతో ఆ విలేఖరు నోరు మూసుకున్నాడు.