మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత సంఖ్యాబలం లేకపోయిన కానీ బీజేపీ(105) ,ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతే కాకుండా ముఖ్యమంత్రిగా దేవేందర్ పడ్నవీస్,ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు కూడా..
దీనిపై శివసేన(56),ఎన్సీపీ(54),కాంగ్రెస్(44) తమకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ స్థానాలున్నాయని దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేసిన దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
ఇందులో భాగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేందర్ పడ్నవీస్ ను బలపరీక్ష నిర్వహించుకోవాలని ఆదేశించింది. అంతేకాకుండా ఇరవై నాలుగంటల్లో అనగా రేపు సాయంత్రం ఐదు గంటల్లోపు తమకు ఎమ్మెల్యేల మద్ధతు ఉందని నిరూపించుకోవాలని సుప్రీం ఆదేశించింది.