కోరుకుంటే కొండమీద ఉన్న కోతిని సైతం తెచ్చే పనివాళ్లు.. కూర్చుని తిన్న కానీ తరగని ఆస్తి .. ప్రేమగా చూసుకునే భర్త.. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వంశానికి చెందిన కోడలు. లక్షలాది మందికి అభిమాన తార. అంత ఘనమైన చరిత్ర ఉన్న అక్కినేని సమంత గుండె పగిలేలా ఏడవడం ఏంటని ఆలోచిస్తున్నారా…?. అయితే అసలు ముచ్చట చెబుతాం వినండి.
చైతూ,సమంత హాష్ ,డ్రోగో అనే రెండు అమెరికా దేశానికి చెందిన పిట్ బుల్స్ ను పెంచుకుంటున్నారు. వీటిలో హాష్ అనే కుక్క పిల్ల తొలి బర్త్ డేను చైతూ.. సమంత చాలా ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో సమంత ఒక ఏమోషనల్ పోస్టును తన ఇన్ స్ట్రాగ్రాం లో పోస్టు చేసింది. అదేమిటంటే..?. ఈ రెండు కుక్కలను పెంచుకునే ముందు బుగబూ అనే కుక్కపిల్లను పెంచుకునేదాన్ని.
అయితే దీనికి పార్వో అనే వైరస్ వ్యాధి సోకి ఇంటికి వచ్చిన నాలుగు దినాలకే కన్నుమూసింది. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ సమంత పోస్టు చేసింది . ఈ క్రమంలో“నేను బుగబూ కోసం నెల పాటు ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాను. కానీ అది ఇంటికి వచ్చిన నాలుగు రోజులకే వైరస్ వ్యాధి సోకి చనిపోయింది. ఆ కుక్క పిల్ల చావుకు నేనే కారణమని భావించాను. గుండె పగిలేలా ఏడ్చాను. ఇంకెప్పుడూ కుక్క పిల్లను తెచ్చుకోకూడదని అనుకున్నానని ఆమె చెప్పుకొచ్చింది.