మద్యం అమ్మకం విషయంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా ప్రతీ ఇంట ఆడవారి కళ్ళల్లో ఆనందం కనిపించింది. మద్యం మహంమారి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డ విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం బార్ల కేటాయింపు విషయంలో నూతన పాలసీకీ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సోమవారం జీవో కూడా జారీచేసింది. ఈ మేరకు షాపులో ఉన్న రూల్స్ నే ఇక్కడా వర్తించనున్నాయి. 21ఏళ్ల వయసు ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా ఏదైనా వ్యాధులు ఉన్నవారికి లైసెన్స్ ఇవ్వరు. ఇక మరొక విషయం ఏమిటంటే మద్యం కేసులో శిక్ష పడితే వారికి లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది.