ఇస్మార్ట్ శంకర్ ఎఫెక్ట్ తో టాలీవుడ్ లో ఒక్కసారిగా వెలుగు వెలిగారు నిధి అగర్వాల్, నభ నటేష్. ఈ చిత్రంతో వీరిద్దరి ఫేమ్ మారిపోయింది. వద్దన్నా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం వీరిద్దరూ కలిసి మరోసారి నటించనున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన వీరు నటించనున్నారు. అసలు ఈ సినిమాకు గాను కైరా అద్వాని ని ముందుగా అనుకున్నారు. కాని ఇందులో డ్యూయల్ రోల్ ఉండడంతో తనని పక్కకి పెట్టి వీరిద్దరిని తీసుకున్నారు.
