చంద్రబాబు అధికారం కోల్పోయిన తరువాత అధికార పార్టీ వైసీపీ పై ఏవేవో ప్రయత్నాలు చేసాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతమందిని ఉసిగొలిపినా చివరికి చంద్రబాబుకే చిల్లు పడింది. ఇవేమీ కాదని చివరికి ఇసుక విషయంలో అటు దత్తపుత్రుడు, ఇటు సొంత పుత్రుడును పంపించినా ప్రజలు వారిని పట్టించుకోలేదు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “వారం రోజుల్లోనే ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి 63 కోట్ల ఆదాయం వచ్చింది. సంవత్సరమంతా చూస్తే ఇది వేల కోట్లలోకి వెళ్తుంది. మరి ఇన్నాళ్లు ఈ రాబడి ఎవరి జేబుల్లోకి వెళ్లింది చంద్రబాబు గారూ? పచ్చ ఇసుక మాఫియా ద్వారా మీకూ వాటా ముట్టేది. అందుకే ఇసుక కొరతపై ఇంత రాద్ధాంతం చేశారు” అని అన్నారు.