ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టు మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీరు వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం… ఆర్టీసీ జేఏసీ పిటిషనర్‌పై మండిపడింది. ఈ సందర్భంగా ప్రభుత్వం కారణంగానే ఆర్టీసీ కార్మికులు చనిపోయారని అనడానికి ఆధారాలు ఏమిటని పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. కార్మికులకు గుండెపోటు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయని వ్యాఖ్యానించింది. ఇప్పటివరకు ఆర్టీసీ కార్మికుల్ని డిస్మిస్ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించలేదంది. సమ్మెకు పిలుపునిచ్చింది ఆర్టీసీ యూనియన్లే కాబట్టి.. వారే దీనికి బాధ్యత వహించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వానికి తాము ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది.
