ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చినాక ఎక్కడా లేని విదంగా రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉండి. రాష్ట్ర ప్రజలు కూడా జగన్ పాలన విషయంలో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్పందిచిన విజయసాయి రెడ్డి “దేశంలోనే ప్రప్రథమంగా అవినీతిపై ఫిర్యాదుల కోసం జగన్ గారు 14400 కాల్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇటువంటి సాహసం ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేయలేక పోయింది. ఎవరు లంచం అడిగినా, డబ్బులివ్వందే పని జరగదని చెప్పినా ఫోన్ చేయొచ్చు. చెప్పడమే కాదు చేసి చూపారు జగన్” అని అన్నారు.
