దేశ రాజధాని ఢిల్లీలో క్రిసిల్స్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రాక్చర్ కాంక్లేవ్ – 2019 సదస్సును మంగళవారం నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రమైన గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ సుపరిపాలన అందించాం. ప్రజల అవసరాలు, అంచనాలకు అనుగుణంగా పాలసీలను రూపొందించాం. ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు మౌలిక సదుపాయాలలో పెట్టుబడులను సమీకరించడంలో రాష్ట్రం అనుసరించిన విధానాలను సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇంక్లుజన్ వంటి ముఖ్యమైన మూడు అంశాలపై రాష్ట్రం దృష్టి పెట్టింది. ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించేందుకు 45వేల కోట్ల రూపాయలు వెచ్చించింది. 50 కొత్త నీటి శుద్ధి కేంద్రాలు, 19 కొత్త ఇంటెక్ వెల్స్, 19000 సర్వీస్ ట్యాంకులు, 1.05 లక్షల కిలోమీటర్ల నీటి పైపు లైన్లను నిర్మించడం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26 నీటిపారుదల పథకాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటి కింద 68,లక్షల 80వేల 161 ఎకరాల ఆయుకట్టును స్థిరీకరించబోతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు తలమానికం. ఐదు ఏళ్లలో 7వేల కిలోమీటర్ల రోడ్ కనెక్టివిటీ పెంచాం. తెలంగాణ వ్యాప్తంగా 2లక్షల 83వేల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 1లక్ష 67 వేల ఇళ్లను నిర్మిస్తున్నాం. రాష్టంలో మౌలిక వసతుల అభివృది కి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ మెట్రో సేవలను రోజుకు మూడు లక్షలకు పైగా ప్రయాణికులు ఉపయోగించుకుంటున్నారు. సమగ్ర రహదారుల నిర్వహణ ప్రాజెక్టు కింద వచ్చే ఐదు సంవత్సరాలు 1000 కిలోమీటర్ల రహదారుల నిర్వహణ ప్రయివేటు ఆపరేటర్లకు అప్పగించాం. నూతన ఇండస్ట్రీయల్ పాలసీతో గణనీయమైన పెట్టుబడులు రావడంతో పాటు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. 2014 సంవత్సరంలో 2400 మెగావాట్ల విద్యుత్ కొరతను అధిగమించగలిగాం. విద్యుత్ అంశంలో తెలంగాణ రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా రాష్ట్రంలోనే రైతాంగానికి ఉచితంగా కరెంటు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
IT and Industries Minister @KTRTRS delivered a keynote address on 'Enhancing Capability – States gearing up' at @CRISILLimited India Infrastructure Conclave 2019 in New Delhi. #InfraConclave2019 pic.twitter.com/ySWUE0kRV0
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 26, 2019