సీఎం జగన్ మనసున్న మారాజు అని మరోసారి రుజువైంది. ప్రతిపక్షంలో ఉన్నా..అధికారంలో ఉన్నా ఆపదలో ఎవరైనా ఉంటే వారికి వెంటనే సాయం చేసి ఆదుకునే మంచి మనసు జగన్‌ది. పాదయాత్రలో ఎంతో మంది అభాగ్యుల ప్రాణాలను నిలబెట్టారు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన వద్దకు సాయం కోరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో బయోడైవర్సరిటీ ఫ్లైఓవర్ పై నుంచి కారు కిందపడిన దుర్ఘటనలో ఒక మహిళ మరణించగా..అనంతపురంకు చెందిన కుబ్రా బేగం అనే యువతి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుబ్రాకు ఇప్పటికే రూ. లక్ష కు పైగా ఖర్చు అయింది. అయితే ఆమె వెన్నెముక తీవ్రంగా దెబ్బతినడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఇందుకోసం సుమారు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుందని తెలిపారు. కుబ్రా తండ్రి అబ్దుల్ అజీజ్..ఓ సాధారణ పెయింటర్. అసలే పేదరికంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు ప్రాథమిక వైద్యం కోసం ఉన్న డబ్బును ఖర్చు చేసి ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి వెంటనే సీఎం జగన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఎమ్మెల్యే చెప్పిన విషయం వినగానే..సీఎం జగన్ వెంటనే స్పందించారు. తక్షణమే కుబ్రా వైద్యానికి అవసరమైన చర్యలు చేపట్టారు. గచ్చిబౌలి కేర్ ఆసుపత్రికి వైద్యానికి సంబంధించిన ఎల్‌ఓసీ(లెటర్ ఆఫ్ క్రెడిట్) పంపారు. యువతి ఆపరేషన్‌కు ఎంత ఖర్చయినా భరిస్తామని తెలియజేశారు. ఈ మేరకు కుబ్రాకు మంగళవారం ఆపరేషన్ చేయనున్నారు. అలాగే ఆపరేషన్ తర్వాత కూడా యువతి తిరిగి సాధారణ స్థితికి చేరుకునేవరకు అండగా ఉంటానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. తమ కూతురు ఆపరేషన్ కోసం సీఎం జగన్ సాయం చేయడానికి ముందుకొచ్చిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఉద్వేగానికి లోనయ్యారు. సాయం కోసం ఎదురుచూస్తూ దిక్కుతోచని స్థితిలో ఉన్న తమకు ఆపద్భాంధవుడిలా వచ్చి మా కూతురి ప్రాణాలని నిలబెడుతున్న సీఎం జగన్‌కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ వ్యవహారంలో సహాయపడిన ఆరోగ్య శ్రీ స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కి కుబ్రా బేగం తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.మొత్తంగా సీఎం జగన్ మానవత్వానికి ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇంత మంచి మనసున్న పాలకుడు కాబట్టే పేదల గుండెల్లో దేవుడిలా సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోయాడని ప్రతి వైయస్ అభిమాని చెమర్చిన కళ్లతో కొనియాడుతున్నారు.
