గత ఐదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో నాలుగు బిల్డింగ్‌లు తప్ప ఇంకేమీ కట్టలేదని వారికి అనుకూల వ్యక్తులకు కాంట్రాక్టులు ఇచ్చుకొని అవినీతికి పాల్పడ్డారని ఏపక్షణా అభివృద్ధికి పాటుపడలేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాజధాని పేరుతో రైతులను ముంచారని, అందుకే ఆయన్ని ఇంట్లో కూర్చొపెట్టారని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు రాజధానిలో తిరుగుతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏం చేశారని రాజధానిలో తిరగడానికి వెళ్తున్నారని ప్రశ్నించారు. రాజధానిలో నాలుగు బిల్డింగ్‌లను కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేదని రాజధాని పేరుతో రైతులను నిలువునా ముంచారని మండిపడ్డారు. చంద్రబాబు హయంలో మోసపోయిన రైతులను కచ్చితంగా ఆదుకుంటామని జగన్ మాట ఇచ్చారని . ఎంత మందికి ప్లాట్లు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేశారని ఏ ఒక్కరికి జగన్ పాలనలో అన్యాయం జరగదని ఆయన తెలిపారు.
మాతృ భాషకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని బొత్స అన్నారు. పేద విద్యార్థుల కోసమే ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకువచ్చామని చెప్పారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ.. ప్రజలందరూ ఆంగ్ల మాద్యమాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. సామాన్యులు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా అనిప్రశ్నించారు. ప్రజలను నుంచి వ్యతిరేకత రావడంతో ఈ విషయంపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ప్రజలకు మంచి చేసే విషయంలో ముఖ్యమంత్రి జగన్ కు రాజీ పడే యోచన లెనేలేదని తెల్పారు.