Home / 18+ / 8 ప్యాక్ ఐనా అచ్చొచేనా..?బెల్లంకొండ న్యూలుక్ !

8 ప్యాక్ ఐనా అచ్చొచేనా..?బెల్లంకొండ న్యూలుక్ !

ఈ ఏడాది ‘రాక్షసుడు’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ మరొక న్యూలుక్ తో ప్రేక్షకులను అలరించేందుకు చూస్తున్నాడు.కందిరీగ, రభస, హైపర్ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందనుంది. ఈనెల 29న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా ప్రారంభంకానుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి మొదలవుతుంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కోసం దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ పర్‌ఫెక్ట్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరికొత్త లుక్‌లో కనపడబోతున్నారు. అందుకోసం అతను ప్రత్యేకంగా 8 ప్యాక్‌తో మేకోవర్ అయ్యారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.సుబ్రమణ్యం ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా డూడ్లే కెమెరామెన్‌గా పనిచేయబోతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సంతోష్ శ్రీనివాస్ ఈ ఇద్దరి శ్రీనివాస్ ల కాంబినేషన్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి ఉండలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat