వైసీపీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రాష్ట్రం రూపురేకలను మార్చేసింది. గత ఐదేళ్ళ ప్రభుత్వ హయంలో ఎన్నో కష్టాలు పడ్డ ప్రజలు. జగన్ వచ్చాక ఈ కొద్దిరోజుల్లోనే ప్రశాంతంగా ఉన్నారు. ఒక పక్క జగన్ ప్రజల బాగు కోసం నిరంతరం కష్టపడుతుంటే ప్రతిపక్షం మాత్రమే ఎప్పుడు ఏ మెలుకు పెడదామా అనే ఆలోచనలోనే ఉంది. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. “ఐదు నెలల్లోనే ఎన్ని అబద్ధాలు, పుకార్లు ప్రచారం చేయాలో అన్నీ చేశారు. ఎల్లో మీడియా రేయింబవళ్ళు గింజుకుంటున్నా వారి కుయుక్తులను ప్రజలు పసిగట్టేశారు. దోపిడీ పాలన పోయినందుకు సంతోషంగా ఉన్నారు. ఇంకా నాలుగున్నరేళ్లు ఎలా తట్టుకుంటారో చంద్రబాబు దొంగల బ్యాచ్” అని అన్నారు.