వైయస్ జగన్‌మోహన్ రెడ్డి లాంటి సీఎంలను ఎంతో మందిని చూశానని, నేను ఎవ్వరికి భయపడేది లేదు, నన్నేం చేయలేరు తమ్ముళ్లు..అంటూ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే నిప్పు నాయుడు అదేనండి టీడీపీ అధినేత చంద్రబాబు గారు బీరాలు పలికారు. ఇవాళ కడప జిల్లా టీడీపీ నేతల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని, టీడీపీని అణచివేయాలని చూస్తున్నారని బాబు ఆక్రోళం వెళ్లగక్కారు. జగన్‌కు దెబ్బలు తగిలినా..గుణపాఠం నేర్చుకోవడంలేదు. ఏపీలో దుర్మార్గపు, రాక్షస పాలన సాగుతోంది. కేసులతో భయపెడతామంటే అది మీ భ్రమే. టీడీపీ కార్యకర్తల ఆర్థికమూలాలను దెబ్బతీయాలని చూస్తున్నారు. మేం ఇదే పంథాలో వెళ్తే మీరు ఉండేవారా? అంటూ బాబుగారు గగ్గోలు పెట్టాడు. బాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. కోర్టులను మేనేజ్ చేసి 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్న నువ్వు భయపడతావా చంద్రబాబు..అంటూ సెటైర్లు వేశారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు, వేధింపులు అని పునరావాస శిబిరాలు పెట్టి డ్రామాలు ఆడావు వర్కవుట్ కాలేదు..ఇంకా పాడిందే పాచిపళ్ల దాసరిలా కేసులు, వేధింపులు అంటే జనాలు నవ్వుకుంటారు చంద్రబాబు అని వారు కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీ కార్యకర్తల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూస్తున్నారని అంటున్నావు…గత ఐదేళ్లలో నువ్వు, నీ కొడుకు, మీ మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకున్న వేల కోట్ల అవినీతి సొమ్మును కక్కిస్తుంటే..కార్యకర్తల ఆర్థిక మూలాలు అంటూ వణికిపోతున్నావు..అంటూ చురకలు అంటిస్తున్నారు. మేం ఇదే పంథాలో వెళ్తే మీరు ఉండేవారా అంటూ బాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని అన్యాయంగా అక్రమాస్తుల కేసులు బనాయించి జైలు పాలు చేసావు..ఐదేళ్లు లక్ష కోట్లు, ఆర్థిక నేరస్థుడు అంటూ నువ్వూ, నీ మంత్రులు జగన్‌ను ఎంత వేధించారో గుర్తులేదా..ఆఖరికి కుట్ర చేసి భౌతికంగా అంతం చేయడానికి కుట్ర చేసి..కోడికత్తి అని ఎద్దేవా చేయలేదా..వైసీపీ శ్రేణులు మండిపడ్డాయి. అవును..జగన్‌లాంటి మంచి సీఎంను నువ్వు ఇప్పటి వరకు చూడలేదు..నువ్వు, నీ పుత్రరత్నం లోకేష్, దత్తపుత్రుడు, ఎల్లోమీడియాతో కలిసి ఎంతగా బురదజల్లుతున్నా..లెక్క చేయకుండా..ప్రజల కోసం భరిస్తూ..ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నాడు..ఒకసారి కళ్లు తెరిచి నీవైపు ఒక్కసారి కాన్సన్‌ట్రేట్ చేస్తే..నువ్వు ఉండవు..నీ పార్టీ ఉండదు..ముందుంది అసలు సినిమా నీకు అంటూ వైసీపీ నేతలు చంద్రబాబుకు కౌంటర్ ఇస్తున్నారు.
