తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఉన్న యాదాద్రి గుట్టపై ఉన్న యాదాద్రి దేవస్థానానికి నిన్న ఒక్క రోజే ఆదివారం రూ. 40 లక్షల వరకు ఆదాయం వచ్చింది .
నిన్న ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో ఆలయానికి భారీగా ఆదాయం వచ్చింది. భక్తులు ఆ మొత్తంలో కానుకలను సమర్పించారు అని ఆలయ ఈఓ గీత తెలిపారు.
యాదాద్రి గుట్టపై బాలాలయం నిర్మించిన నాలుగేళ్లల్లో తొలిసారిగా ఇంత మొత్తంలో కానుకల ద్వారా ఆదాయం వచ్చింది అని ఆమె తెలిపారు.