తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ లోని బుల్లెట్ ఫ్రూప్ కారు ప్రమాదానికి గురి అవ్వడంతో ఇద్దరు మృత్యువాతపడగా .. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంగతి విదితమే.
మృతి చెందిన వారిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కారు డ్రైవర్ పార్థసారథి, సోషల్ మీడియా ఇంఛార్జ్ పూర్ణ ఉన్నారు. అయితే రోడ్డు ప్రమాదం మృతి చెందిన పార్థసారధి అంతిమయాత్రలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు.
డ్రైవర్ మృతిదేహాం చూసి ఆయన బోరున విలపించారు. అనంతరం అంతిమయాత్రలో మంత్రి పాడెను మోశారు. అప్పటి వరకు తనతోనే ఉన్న డ్రైవర్ తిరిగిరాని లోకాలకెళ్లడంతో మంత్రి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మొన్న జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం చిటూరు శివారులో మంత్రి కాన్వాయ్ లోని కారు పల్టీ కొట్టిన సంగతి తెల్సిందే..