ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో పాలేరు రిజర్వాయర్ నందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాల అభివృద్ధి సంస్థ మరియు సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ IAS గారు కలిసి పాలేరు రిజర్వాయర్ లో రోయ్య పిల్లలను విడుదల చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కుల వృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. తెలంగాణ వచ్చాక మత్స్యకారులకు అన్నిరకాలుగా ప్రయోజనం జరిగిందని, మత్స్యకారుల జీవితాల్లో కేసీఆర్ గారు వెలుగు నింపారని తెలియజేశారు. గతంలో మత్స్యకారులకు కేటాయించే అవకాశాలు లేకుండా ఇబ్బందులు పడుతున్న ఇటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకు పూర్తిస్థాయిలో అన్ని రకాలుగా 100 శాతం సబ్సిడీ అందించడంతో పాటు, వారికి కావలసిన అవసరాలు తీర్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పధకాలు వారి జీవితాల్లోకి వెలుగును తెచ్చింది అని అన్నారు.
ముఖ్యంగా వారికి కావలసినటువంటి మోపెడ్ లు, వలలు, వాహనాలు, చేప పిల్లలు, ఐస్ బాక్సులు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అని, ఖమ్మం జిల్లాలో 707 చెరువులలో 2.50 కోట్ల రూపాయల ఖర్చుతో 318 లక్షల చేప పిల్లలు 100 శాతం రాయితీతో ఇవ్వడం జరిగింది అని చెప్పారు. పాలేరులో ప్రస్తుతం 6.5 లక్షల రోయ్యలను, కూసుమంచి లో 0.16 లక్షలు రొయ్య పిల్లలను పోయటం జరిగిందని తెలియజేశారు. జిల్లాలో ఈ సంవత్సరం 31 కోట్ల రూపాయల ఖర్చుతో వివిధ రకాల అవకాశాలను కల్పించారన్నారు. మత్స్య సంపదను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందాన్ని వ్యక్తం అవుతుంది అని, పాలేరు రిజర్వాయర్ మంచినీటి చేపల పెంపకంలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఇక్కడ సుమారు 13 వందల మంది మత్స్యకారులు 18 గ్రామాల నుండి పాలేరు రిజర్వాయర్లో చేపల వేటపై ఆధారపడి ఉన్నారు. కాబట్టి పాలేరు రిజర్వాయర్ కు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఒక ఫిష్ మార్కెట్ మార్కెట్ చేస్తే హైవే రోడ్ లో ఏర్పాటు చేస్తే చేపల వేట పై అదారపడ్డ మత్స్యకారులకు జీవనోపాధి తో పాటు ఆర్థికంగా బలపడ్డుతారని అభిప్రాయ పడ్డారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం మోటార్ వెహికల్స్ మత్స్యకారులకు అవసరమైన పరికరాలతో పాటు చేప పిల్లలు రొయ్య పిల్లలను అందిస్తుందన్నారు. మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
వందల కోట్ల రూపాయలను వెచ్చించి రాష్ట్రంలో అన్ని కులాల వారికి అన్ని కుల వృత్తుల ను అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకొని ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ పథకంలో భాగంగా మూగజీవాలను రక్షించేందుకు మొబైల్ వెహికల్ ప్రత్యేకంగా డాక్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా పాలేరు రిజర్వాయర్ ఎప్పుడు నీళ్లు ఉండే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. ఖమ్మం భద్రాద్రి జిల్లాలకు రాబోయే కాలంలో కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు మత్స్యకారుల అభివృద్ధి కోసం కేటాయిస్తామన్నారు . ప్రభుత్వం ఇచ్చే ఈ అవకాశాన్ని మత్స్యకారులు ఉపయోగించుకోవాలని అన్నారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ పాలేరు రిజర్వాయర్ వ్యవసాయ రంగానికి కాకుండా మత్స్యకారుల అభివృద్ధి కోసం పాట పడుతుందన్నారు. రాబోయే రోజుల్లో పాలేరు జలాశయాన్ని గోదావరి నీటితో నింపుతామన్నారు. కులవృత్తులు దేదీప్యమానంగా వెలుగొందెందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వానికి పాలేరు ప్రజలు రుణపడి ఉండాలన్నారు.
చేప పిల్లలు గొర్రె పిల్లలు, గేదలు లాంటి పథకాలను ప్రవేశపెట్టి కులవృత్తులను గౌరవిస్తోందని అన్నారు. బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. అన్ని రకాల కుల వృత్తుల వారు ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్య సంపదపై ప్రత్యేక దృష్టి సారించి సంపదను సృష్టింపజేస్తుందని వివరించారు. రాష్ట్రాల్లో చెరువుల అభివృద్ధి ద్వారా సాగు, త్రాగు నీరుతో పాటు చేపపిల్లలను ఉచితంగా అందజేస్తూ మత్స్యకారుల కుటుంబాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులు నింపారన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలు దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు ఇస్తామని అన్నారు.