ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి రోజురోజికి దారుణంగా తయారవుతుందని చెప్పాలి. ఒక్క పక్క అధికారపార్టీ ని విమర్శించాలి మరోపక్క తన పార్టీ నాయకులను కాపాడుకోవాలి ఇలా మొత్తం చంద్రబాబు నెత్తిన పడింది. ఇక గెలిచిన ఎమ్మెల్యేల విషయానికి వస్తే ఏ క్షణంలో ఎలా ఉంటారో తెలిదు. ఈ విషయంపై బాబుకి గట్టి కౌంటర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి. “వచ్చే ఆరు నెలల్లో చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి. టీడీపీ ఎమ్మెల్యేల ఆవేదన చూస్తుంటే ఐదారుగురైనా మిగిలేది అనుమానమే. లోకేష్ రెండోసారి ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండక పోవచ్చు. కేసులైనా తప్పించుకోవచ్చని బీజేపీ చంక ఎక్కడానికి చూస్తున్నారు.