ఎనిమిదేళ్ల క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల ఉన్నాయనే ఆరోపణలతో ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌పై సీబీఐ 11 అక్రమ కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. ఇందులో దాదాపు 9 కేసులు వీగిపోయాయి. మిగిలిన రెండు, మూడు కేసుల నిమిత్తం జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. ప్రతిపక్ష నేతగా ఏడాదికి పైగా సుదీర్థ పాదయాత్ర నిర్వహించిన సమయంలో ప్రతి శుక్రవారం పాదయాత్రకు విరామం ఇచ్చి హైదరాబాద్‌కు వచ్చి సీబీఐ కోర్టు ముందు హాజరయ్యేవారు. అయితే ఏపీలో అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చి సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్‌కు ప్రతి వారం సీబీఐ కోర్టుకు హాజరు కావడం ఇబ్బందిగా మారింది. పాలనా వ్యవహారాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైయస్ జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు అయ్యేందుకు ప్రతి వారం 60 లక్షల రూపాయలను ప్రభుత్వం తరపున ఖర్చు చేయాల్సి ఉంటుందని, అందువల్ల వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ తరపున న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. దీనిపై వాదోపవాదాలను విన్న న్యాయస్థానం తొలుత ఈ పిటీషన్‌ను తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సహా ఎల్లోమీడియా పండుగ చేసుకుంది..ఇక చంద్రజ్యోతి పత్రిక అయితే వచ్చి తీరాల్సిందే అంటూ ఓ కథనం రాసి సంబరపడింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రైనా సరే ..నిందితుడిగా ఉన్న కేసుల్లో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావల్సిందే అంటూ జగన్‌పై విషం కక్కింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కూడా సీబీఐ కూడా జగన్‌కు మినహాయింపు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. తాజాగా ఇదే విషయంపై దాఖలైన మరో పిటీషన్‌పై విచారించిన సీబీఐ కోర్టు సీఎం జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో ప్రతి శుక్రవారం జగన్ న్యాయస్థానం ముందు హాజరు కావాల్సిన అవసరం ఉండదు. దీంతో ప్రతి శుక్రవారం, కోర్టు అని పిచ్చివాగుడు వాగే చంద్రబాబు, ఎల్లోమీడియాకు చలిజ్వరం వచ్చినట్లే అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.