పట్టపగలు పదిమంది వచ్చిపోయే బస్టాండులో అశ్లీల వీడియో దర్శనమిచ్చింది దీంతో అక్కడి జనం సిగ్గుతో తలదించుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.భోపాల్ రాష్ట్రంలోని విద్యానగర్ అనే ప్రాంతంలోని బస్టాండ్‌లో ఉన్న టికెట్ వెండింగ్ మిషన్ స్క్రీన్‌పై ఒక్కసారిగా శృంగార వీడియో ఒకటి ప్రత్యక్షమయ్యింది. అది చూసిన జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు.బస్టాండ్‌లో ఇలాంటి వీడియోలు ఏమిటి అంటూ ముక్కున వేలేసుకున్నారు. దాన్ని నిలిపేయడం సాధ్యం కాక పారిపోయారు. ఓ యువకుడు ఆ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పడేశారు.
అది కాస్త వైరల్ కావడంతో సంబంధిత అధికారులు సాంకేతిక లోపం వల్ల అలా జరిగిందంటూ చెప్పుకొచ్చారు.ఇక సోషల్ మీడియాలో ఆ వీడియో చూసిన జనం బస్టాండ్‌లో ప్రజలను ఇబ్బంది పెట్టే ఇలాంటి వీడియోలు ఎలా వేశారంటూ ప్రశ్నలు గుప్పించారు. గత నెల 28న అక్కడి బస్టాండులో ఏర్పాటు చేసిన టికెట్ వెండింగ్ మిషన్ స్క్రీన్‌పై రెండు పోర్న్ వీడియోలు దర్శనమిచ్చాయి.