అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా.. బక్కపలచు భామ.. నేచూరల్ అందాల రాక్షసి సాయి పల్లవి ప్రముఖ ప్రేమ కథా చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కితున్న లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే చైతూ వెంకీమామ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు.
మొన్న శనివారం చైతూ తన ముప్పై మూడు వసంతాలను పూర్తిచేసుకుని ముప్పై నాలుగో వసంతంలోకి అడుగు పెట్టిన సంగతి విదితమే. శనివారం పలువురు సినీ రాజకీయ ప్రముఖులు చైతూకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ విషెస్ తెలిపారు.
వీరిలో హీరోయిన్ సాయి పల్లవి కూడా ఉంది. సాయి పల్లవి ట్విట్టర్లో “స్వచ్చమైన నవ్వు… మంచి మనస్సున్న చైతన్య గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు”అని ట్వీట్ చేసింది.
దీనికి బదులుగా చైతూ రీట్వీట్ చేస్తూ” ధన్యవాదాలు .. కానీ నన్ను దయచేసి గారు అని మాత్రం అనోద్దు. ప్లీజ్ అలా పిలిచి తన వయస్సు చాలా ఎక్కువ అన్పించేలా చేయద్దు” అని రిప్లై ఇచ్చాడు చైతూ.