సొంతగడ్డపై టీమిండియా కు తిరుగులేదని నిరూపించింది కోహ్లి సేన. మొన్న సౌతాఫ్రికా, నిన్న బంగ్లాదేశ్ రెండు జట్లను ఉతికారేసింది. అంతేకాకుండా వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది. దీంతో సొంతగడ్డపై వారికి తిరిగిలేదు అని చూపించింది. మరో వైపు బంగ్లాదేశ్ చాలా దారుణంగా ఓడిపోయింది. పింక్ బాల్ టెస్ట్ కనీసం మూడు రోజులైనా ముగియకుండానే బంగ్లా చేతులెత్తేసింది. అంతేకాకుండా ఈ టెస్ట్ విజయంతో భారత జట్టు ఎన్నో రికార్డులను తమ సొంతం చేసుకుంది. హేమాహేమీ జట్టులైన సరే భారత గడ్డపై తగ్గి ఉండాల్సిందే అని అందరికి తెలియజేసింది.