కాజల్ అగర్వాల్ అంటే కుర్రకారు మతి పోగొట్టే అందం.. తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న చక్కని అభినయం ఆమె సొంతం. చిన్న హీరో సరసన నటించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ చందమామ వరుస విజయాలతో మెగాస్టార్ లాంటి హీరోలతో ఆడిపాడిన మిల్క్ బ్యూటీ ఈ నటి.
ఇప్పటివరకు కాజల్ దాదాపు యాబై సినిమాల్లో నటించింది. కోలీవుడ్ ,టాలీవుడ్ అంటూ తేడా ఏమి లేకుండా అన్ని భాషాల్లో నటించింది ఈ అందాల రాక్షసి. తాజాగా ఈ బ్యూటీ కన్నడంలోకి అడుగు పెట్టనున్నది.
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రతో జోడి కట్టనున్నది. కబ్జా అనే మూవీలో నటించడానికి ఈ రాక్షసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని కన్నడ సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. చూడాలి మరి అమ్మడు అక్కడ ఎలా రాణిస్తుందో..!