తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం త్వరలోనే వైద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నది. వైద్యశాఖలో ఖాళీగా ఉన్న మొత్తం పన్నెండు వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర తెలిపారు.
వైద్య ఖర్చుల నుంచి రాష్ట్రంలో పేదవార్ని ఆదుకునేందుకు సర్కారు ఉచిత వైద్యసేవల కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను పెంచుతున్నట్లు మంత్రి వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులల్లో కార్పోరేట్ స్థాయి వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.