నరసాపురం వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి రఘురామకృస్ణంరాజు తను బిజెపి లో చేరతానంటూ వస్తున్న విమర్శలపై గట్టిగానే బదులు ఇచ్చారు. బిజెపి లోకి వైసిపి ఎమ్.పిలు ఎవరూ వెళ్లరని, ఎవరైనా ఒక్కరి పేరు సుజనా చౌదరి చెప్పాలని ఆయన అన్నారు. ఆమాటకు వస్తే సుజనా చౌదరే వైసిపిలోకి రావచ్చని ఆయన అన్నారు.పార్లమెంటు సమావేశాలలో అంతా టచ్ లోనే ఉంటారని, సుజనాతో ఎవరైనా టచ్ లో ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు. మరో పాతికేళ్లు జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రజలు భావిస్తున్నారని జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో విజయవంతంగా కొనసాగుతుందని ఆయన అన్నారు.ఇంత మంచి సీఎం ఉండగా.. నేతలెవరూ పార్టీ మారతారని అనుకోవడంలేదని అంత అవసరం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని వ్యాఖ్యానించారు. అనుమతిస్తే సుజనానే వైసిపిలోకి రావచ్చని ఆయన అన్నారు.