తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత యాబై రెండు రోజులుగా సమ్మె చేస్తోన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులకు గత రెండు నెలలుగా ప్రభుత్వం కానీ ఆర్టీసీ యజమాన్యం కానీ జీతాలు ఇవ్వలేదు. దీనిపై ఆర్టీసీ సిబ్బంది,జాక్ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేని కారణంగా కొంత సమయం కావాలని ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది. దీన్ని మన్నించిన హైకోర్టు ఇప్పటికే జీతాలు ఆలస్యమైంది. కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
