టాలీవుడ్ సంచలన మరియు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎంతటి ధైర్యవంతుడో అందరికి తెలిసిన విషయమే. ఎవరిపై సెటైర్ వెయ్యాలన్న అది వర్మ తరువాతే. అయితే తాజాగా వర్మ మన దేశం వాడిని కాకుండా పక్క దేశం వారిపై టార్గెట్ చేసాడు. అది మామోలు మనిషిని కూడా కాదు. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కే సెటైర్ వేసాడు. నిజమైన ట్రంప్ ఒక్క అమెరికాకే కాదు అలాగని ప్రపంచానికే కాదు మొత్తం విశ్వానికే ప్రమాదకరమని వర్మ కామెంట్ చేసాడు. 2020కి ట్రంప్ ను బయటకు తరమండి అని ట్వీట్ చేసాడు.