సినిమాలు తీసుకుంటూ ఎప్పుడూ టాప్ లో ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం సాధించాలి అనుకుంటున్నాడో తెలియదు గాని రాజకీయాల్లోకి వచ్చాక ఉన్న కాస్త పరువు కూడా పోగొట్టుకున్నాడు. మరోవైపు గత ఎన్నికల్లో చంద్రబాబుకు వత్తాసు పలికి ఆయన గెలిచాక ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ ఎక్కడా కనిపించలేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తానని తాను పోటీ చేసిన సీట్లలో కూడా గెలవలేకపోయాడు. చంద్రబాబుకి వ్యతిరేకం అని చెప్పుకునే పవన్ మాత్రం ఆయన చెప్పినట్టే నడుచుకుంటున్నాడని తెలుస్తుంది. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “నిత్య కళ్యాణం కామెంట్లు చూస్తుంటే బీజేపీలో విలీనానికి తెగ ఆరాట పడుతున్నట్టు తెలిసిపోతోంది. చంద్రబాబు అప్పగించిన పనిని దత్త పుత్రుడు శ్రద్ధగా చేస్తున్నాడు. ప్రయత్నం లోపంలేకున్నా అసలు చెల్లని కాసు పార్టీలను కలుపుకునేందుకు బీజేపీ అంగీకరిస్తుందో లేదో చూడాలి” అని అన్నారు.
