దుబాయ్ వేదికగా బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు విందు రాయబారాలు నడిపిస్తున్నాడా…లేదా బీజేపీ పెద్దలు ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీశారా..ఎంగేజ్‌మెంట్ పేరుతో బీజేపీలో టీడీపీ విలీనం తంతు నడుస్తోందా..ప్రస్తుతం సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ చేసిన వ్యాఖ్యలు చూస్తే నిజమే అనిపిస్తోంది. దుబాయ్‌లో జరుగుతున్న బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుమారుడి ఎంగేజ్‌మెంట్ వేడుకలపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆపరేషన్ ఆకర్ష్‌కు భాజపా నేతలు తెరతీశారు. దుబాయ్‌లో ఎంపీ సీఎం రమేష్ కుమారుడు ఎంగేజ్‌మెంట్ వేదికగా పావులు కదుపుతున్నారు. ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేసి బీజేపీ, వైసీపీ, టీడీపీ నాయకులను తీసుకువెళుతున్నారంటూ..సీపీఐ నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం తిరుపతిలో మీడియాతో నారాయణ మాట్లాడుతూ…అధికారం కోసం బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో కేసీఆర్‌ను, జగన్‌ను కూడా బీజేపీ వదలదని విమర్శలు చేశారు. కాగా దుబాయ్‌లో జరుగుతున్న సీఎం రమేష్ కొడుకు ఎంగేజ్‌మెంట్ వేదికగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీసిందన్న నారాయణ ఆరోపణలపై ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఏపీలో టీడీపీని నిర్వీర్యం చేయాలని భావిస్తున్న బీజేపీ ఇప్పటికే టీడీపీ కీలక నేతలకు గాలమేస్తోంది. గంటా, వాసుపల్లి గణేష్ వంటి టీడీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటోంది. మొత్తంగా టీడీపీని తమ పార్టీలోకి విలీనం చేసుకునేందుకు బీజేపీ పెద్దలు ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర తీశారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఏపీలో ఓ రాజకీయ ప్రముఖుడికి ఓ పేరుగాంచిన సంస్థ నుండి 150 కోట్లు ముడుపులు అందాయని ఐటీ శాఖ ఇటీవల ప్రకటించింది. ఈ 150 కోట్లు అందుకున్న ప్రముఖుడు ఎవరో బీజేపీ పెద్దలకు తెలుసని, అందుకే దాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీని బీజేపీలో విలీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అయితే బీజేపీతో పొత్తు కోసం విందు రాయబారాలు నడిపిస్తున్న చంద్రబాబుకు.. ఈ 150 కోట్ల ముడుపుల బాగోతం కక్కలేక, మింగలేని పరిస్థితి తీసుకువచ్చిందని భోగట్టా..దీంతో త్వరలోనే బీజేపీలో టీడీపీ విలీనం ఖాయమని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు టీడీపీ ఎమ్మెల్యేలు 20 మంది తనతో టచ్‌లో ఉన్నారని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు, మరోవైపు చంద్రబాబుతో సహా 23 మందిని తమ పార్టీలో కలుపుకుంటామని సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యలు విలీనం వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. మొత్తంగా దుబాయ్‌లో సీఎం రమేష్ ఎంగేజ‌్‌మెంట్ వేదికగా బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసిందన్న సీపీఐ నారాయణ ఆరోపణలు నిజమయ్యేలా పరిణామాలు జరుగుతున్నాయి. మరి టీడీపీ, బీజేపీలో పూర్తిగా విలీనం అవుతుందా లేదో చూడాలి..
