మహారాష్ట్రలో బిజేపి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ప్రతిపక్షాలు బిజేపి పై,ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పైన విమర్శలు ఎక్కుపెట్టాయి..ప్రభుత్వ ఏర్పాటు విరుద్దమని,న్యాయస్థానంలోనే తేల్చుకుంటామంటు సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది..మరో వైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ లు పెడుతూ బిజేపీ చేసిన పనిని ఖండిస్తున్నాయి..కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బీజేపి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు..రాజకీయ విలువలు పాటించకుండా రాత్రిరాత్రికే మంతనాలు జరిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడం సిగ్గుచేటని,దీనికి రాష్ట్రపతి,గవర్నర్ వంటి ఉన్నత స్థాయిలో వ్యక్తులు కూడా సహకరించటం దారుణమన్నారు..వేరే పార్టీ ఎమ్మేల్యేలను భయపెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితికి బిజేపి చేరుకోవటం సిగ్గుచేటని విమర్శించారు..కొంత మంది ఎన్సీపి ఎమ్మేల్యేలే బిజేపి ట్రాప్ లో పడ్డారని,మిగతావారు ఎన్సీపి వెంటే ఉన్నారని వేణుగోపాల్ తెలిపారు..అసెంబ్లీ లో జరిగే బలపరీక్షలో ఫడ్నవీస్ మెజార్టీ నిరూపించుకోలేరని కాంగ్రెస్ నేత వాఖ్యానించారు..ఫడ్నవీస్,అజిత్ పవార్ వెళ్లి కలవగానే రాష్ట్రపతి పాలనను క్యాబినెట్ మీటింగ్ లేకుండా ఎత్తివేయటం ఏంటని ఆయన ప్రశ్నించారు..ప్రధాని మోదీ,ఇతర బీజేపి లీడర్లు కలసి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని కాంగ్రెస్ నాయకుడు వేణుగోపాల్ ఆరోపించారు..