తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సంక్షేమాభివృద్ధిలో పరుగులు పెడుతుంది. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి పలు అవార్డులు వస్తోన్నాయి. అందులో భాగంగా మీసేవ,డిజిటల్ పేమెంట్ యాప్ -T వాలెట్ ద్వారా సేవలు అందిస్తూ ఈ గవర్నెన్స్ లో తెలంగాణ రాష్ట్రం టాప్ లో ఉందని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,500కేంద్రాల్లో 500కి పైగా సేవలతో పాటుగా సర్టిఫికేట్స్ జారీ చేస్తున్నాము. ఇతర సేవలని కూడా అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ఏడాదిలో 30.8మిలియన్ల మంది మీసేవ సర్వీసులను వినియోగించుకున్నారు. 102కి పైగా శాఖలు మీ సేవ ద్వారా సేవలందించాయని ఆయన స్పష్టం చేశారు.