మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహాకరించి.. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ కు ఎన్సీపీకి చెందిన నేతలు షాకిచ్చారు. ఈ క్రమంలో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో హైడ్రామా చోటు చేసుకుంది.అందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి అయిన అజిత్ పవార్ ను ఎన్సీపీ నేతలు ఒక గదిలో బంధించారు. అజిత్ ను గదిలో ఉంచి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేత మాట్లాడిస్తున్నారు. గది నుంచి బయటకు రాకుండా నేతలు కాపాలా కాస్తున్నారు.
