తమిళనాడు రాష్ట్రంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ త్వరలోనే ప్రత్యేక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టనున్నారు అని వార్తలు వచ్చిన సంగతి విదితమే. అయితే ఇటీవల విశ్వనటుడు కమల్ హాసన్ మాట్లాడుతూ రాజకీయాల్లో సూపర్ స్టార్ రజనీ కాంత్ తో కలిసి పనిచేయడానికి సిద్ధమని ప్రకటించిన సంగతి తెల్సిందే. తాజాగా కాంగ్రెస్ ఎంపీ వసంతకుమార్ మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే- కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం రావాలని సూపర్ స్టార్ రజనీ కాంత్ చెబుతున్న అద్భుతమని అన్నారు. నిన్న శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ” స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో పరోక్ష పద్థతి ప్రజాస్వామ్యానికి ద్రోహం” అని అన్నారు. తమ సమస్యలను పరిష్కరించేవార్ని ప్రజాప్రతినిధులుగా ప్రజలెన్నుకుంటారు.కానీ ఏడీఎంకే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూనిచేస్తూ పరోక్ష ఎన్నికలను నిర్వహిస్తోంది అని అన్నారు..స్థితిమంతులే స్థానిక పదవుల్లో కూర్చొబెట్టాలనేదే అన్నాడీఎంకే ఉద్దేశంగా వుందని అన్నారు. ఇలాంటి అన్నాడీఎంకేకు చరమగీతం పాడి డీఎంకే-కాంగ్రెస్ పాలన రావాలనేదే రజనీకాంత్ వ్యాఖ్యానించిన అద్భుతమని అన్నారు. అలాగే, రజనీ, కమల్లు డీఎంకే-కాంగ్రెస్ కూటమిలో చేరాలని ఆహ్వానిస్తున్నట్లు ఆయన పిలుపునిచ్చారు.
