తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రముఖ గాయని సుశీల గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి, ప్రముఖ పాత్రికేయులకు పురస్కారాల ప్రదానంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కళల ను, కళాకారులను ప్రోత్సహిస్తున్నారన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో రవీంద్రభారతిలో ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహించాలంటే కళాకారులకు ఎంతో ఇబ్బంది ఉండదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రవీంద్రభారతిని ఆధునికీకరణ చేసి కళాకారుల కు అందించారు.
ప్రతి రోజు సంగీత , సాహిత్య, కళారూపాల కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రముఖ పాత్రికేయులకు పురస్కారాలను అందించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ శ్రీ రాజేశం గౌడ్ శృతిలయా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.