ఎన్సీపీ నుంచి సస్పెండ్ అయిన అజిత్ పవార్ బీజేపీకి మద్దతు తెలిపి ఉప ముఖ్యమంత్రిగా నిన్న శనివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో అజిత్ పవార్ బీజేపీకి మద్దతు తెలపడం వెనక బలమైన కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. తాజాగా అజిత్ పవార్ పై దాదాపు డెబ్బై వేల కోట్ల కుంభకోణంలో నిందితుడని పత్రికల్లో వస్తోన్న వార్తలు.
గతంలో 1999-2014 వరకు మూడు సార్లు కాంగ్రెస్,ఎన్సీపీ కూటమి అధికారాన్ని చేపట్టింది. అజిత్ 2009లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నీటిపారుదల శాఖలో రూ.డెబ్బై వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు వార్తలు రావడంతో ఆయన 2012లో తన పదవీకి రాజీనామా చేశారు.
ఆ ఆరోపణలు రుజువు కాకపోవడంతో మరల ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మహారాష్ట్ర సహాకార బ్యాంకులో జరిగిన రూ.25వేల కోట్ల కుంభకోణంలో కూడా ఆయన నిందితుడిగా ఉన్నాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన బీజేపీ బెదిరింపులకు లోబడి మద్దతు ఇచ్చారని మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న వార్తలు.