తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రయాణిస్తోన్న కాన్వాయ్ లోని కారు ప్రమాదానికి గురైంది. నిన్న శనివారం హైదరాబాద్ నుంచి తన నియోజకవర్గమైన పాలకుర్తికి వెళ్తోన్న సమయంలో జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని చీటూరు గ్రామ శివారులో శనివారం రాత్రి పదకొండున్నరకు మంత్రి కాన్వాయ్ లోని బుల్లెట్ ప్రూఫ్ కారు బోల్తా పడింది.
ఈ ఘటనలో మంత్రి సోషల్ మీడియా ఇంచార్జ్ పూర్ణ,డ్రైవర్ పార్థసారధి అక్కడక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చారు.
అయితే వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం సంఘటన తెల్సిన వెంటనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు క్షత్రగాత్రులను పరామర్శించారు.