ఎన్నో మలుపులు.. మరెన్నో సంచనాలు నమోదైన మహారాష్ట్రలో ఎన్సీపీ,బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో వీటన్నిటికి తెర పడింది. ఈ రోజు ఉదయం మహారాష్ట్రంలో వారం రోజుల ముందు విధించిన రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తున్నట్లు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనిని రాష్ట్రపతి పేరిట కేంద్ర హోం శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఈ రోజు తెల్లవారు జామున 5.47గంటలకు ఎత్తివేస్తూ గెజిట్ ను విడుదల చేశారు.
ఆ తర్వాత ఉదయం ఎనిమిది గంటలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పడ్నవీస్ ,ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్ లను గవర్నర్ భగత్ సింగ్ కోషియార్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కీలకమైన ఘట్టంలో కేంద్ర హోం మంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చక్రం తిప్పారు.
ఇందులో భాగంగా ముందుగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు రాష్ట్రపతి పదవీతో పాటు శరద్ పవార్ సోదరుడైన అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రితో పాటుగా ఎన్సీపీకి పలు మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు అమిత్ షా తెలిపినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే అంతకుముందే అమిత్ షా శరద్ పవార్ ను ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో భేటీ అయ్యేలా చేశారు అని ఇటు మహారాష్ట్రతో పాటు దేశ రాజధాని ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తోన్న వార్తలు.