ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 సంవత్సరంను “నర్సింగ్ ఇయర్” గా ప్రకటించింన సందర్భంగా రవీంద్రభారతిలో జరగబోయే కార్యక్రమమునకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారిని కలసి నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆహ్వానించడం జరిగింది.అమెరికా, ఇంగ్లండ్ యూరప్ వంటి దేశాల ప్రభుత్వాలు అధికారికంగా నర్సింగ్ ఇయర్ ను జరుపుకోబోతున్నాయి.
అందులో భాగంగా భారత్ దేశంలో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా రవీంద్ర భారతి లో డిసెంబర్ 7వ తేదీన ఈ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు “హెల్త్ ఫర్ ఆల్” అనే అంశంపై నర్సింగ్ ఉద్యోగులు మరియు నర్సింగ్ విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించబడుతుంది పాల్గొనదల్చిన వారు 9700015427 నంబర్ నందు సంప్రదించగలరన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రయివేటు, నర్సింగ్ ఆఫీసర్స్ మరియూ నర్సింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొంటారు.
ఈ సమావేశం మెట్టుగూడలోని అసోసియేషన్ వారి కార్యాలయంలో జరిగింది.మంత్రి గారిని కలిసి ఆహ్వానించిన వారిలో నర్సింగ్ ఆఫీసర్స్అసోసియేషన్ అధ్యక్షులు శ్రీను రాథోడ్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రుడావత్, గౌరవ సలహాదారులు చెరుకూరి రామ్ తిలక్, చిలుపూరి వీరాచారి, కోశాధికారి వంశీ ప్రసాద్ మొదలగు వారు పాల్గొన్నారు.
Post Views: 296